मैं आतिरा – అతిరా జీ పుస్తకం హిందీ ఎడిషన్ విడుదలైంది
AVS
దిల్లీ ముఖ్యమంత్రివర్యులు శ్రీమతి రేఖా గుప్తా గారు, ఆతిర అనే అమ్మాయి యొక్క ఇస్లాంలోకి తీవ్రవాదీకరణ (రాడికలైజేషన్) మరియు అనంతరం ఆర్ష విద్య సమాజం ద్వారా సనాతన ధర్మానికి చేసిన తిరుగుప్రయాణాన్ని వివరించే ఆత్మకథా పుస్తకం యొక్క ‘మై ఆతిరా’ హిందీ అనువాదాన్ని విడుదల చేసారు. ఆచార్యశ్రీ కె.ఆర్. మనోజ్ గారి నాయకత్వంలో ఆర్ష విద్య సమాజం చేస్తున్న అతివాద భావాల నిర్మూలన (డీ-రాడికలైజేషన్) సేవలను ఆమె ప్రశంసించారు. సంస్థ లక్ష్యాన్ని బలపరిచే ఏ కార్యక్రమానికైనా తాను సంతోషంగా మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. “ఈ బాలికలు చూపిన అపారమైన ధైర్యం గమనార్హం. తీవ్రవాదీకరణకు గురైన బాలికలను రక్షించడంలో వారి కృషిని మనం పునరావృతం చేయాలి” అని ఆమె అన్నారు.
“మన సమాజానికి ఈరోజు ఉగ్రవాదం వంటి సమస్య యొక్క మూలకారణాలను గుర్తించే పరిష్కారాలు అవసరం. ఒక సమస్య యొక్క బాహ్య, అంతర్గత రెండు కారణాలను వెలికితీయకుండా ఏ పరిష్కారమూ ఫలప్రదం కాలేదు” అని ఆర్ష విద్య సమాజం (AVS) వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ ఆచార్యశ్రీ కె. ఆర్. మనోజ్ గారు తెలిపారు. ఆయన న్యూ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా లో, విశ్వహిందూ పరిషద్ — ఇంద్రప్రస్థ ప్రాంత ఆధ్వర్యంలో, ఆర్ష విద్య సమాజం సహకారంతో నిర్వహించిన “జిహాద్ కి కహానీ, పీడిత బహనోం కి జుబాని” కార్యక్రమంలో ప్రధాన ప్రసంగాన్ని అందించారు.
“ఉగ్రవాదానికి మూలకారణం కొన్ని సిద్ధాంతాలు మరియు వాటి యొక్క వివిధ మెదడు నియంత్రణ (బ్రెయిన్‌వాషింగ్) పద్ధతుల్లో ఉంది. వీటిని ఎదుర్కొనే మార్గాలను కనుగొనకుండా ధార్మిక ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం చేస్తున్న నిష్కపటమైన ప్రయత్నాలతో పాటు, అతివాద భావాల నిర్మూలన (డీ-రాడికలైజేషన్) కార్యక్రమాలు కూడా శాస్త్రీయంగా, వ్యవస్థాత్మకంగా నిర్వహించాలి. సుదర్శనం గ్లోబల్ సర్వీస్ మిషన్ (SGSM) ఇందుకు అత్యంత ప్రభావవంతమైన సాధనం” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషద్ — ఇంద్రప్రస్థ ప్రాంత అధ్యక్షులు శ్రీ కపిల్ ఖన్నా గారు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వైభవ్ శర్మ గారు (అధ్యక్షులు, భారతీయ జన సేవా సంస్థ), శ్రీ సురేంద్రకుమార్ గుప్తా గారు (మంత్రి, విశ్వహిందూ పరిషద్ — ఇంద్రప్రస్థ ప్రాంత్), శ్రీ శైలేంద్ర గారు (జనరల్ సెక్రటరీ, భారతీయ జన సేవా సంస్థ), శ్రీ రమేష్ శర్మ గారు (రాష్ట్ర ఉపాధ్యక్షులు, విశ్వహిందూ పరిషద్), శ్రీ సుభోద్ చంద్ర గారు (సంఘటన్ మంత్రి, విశ్వహిందూ పరిషద్), శ్రీ సునీల్ సూరి గారు (సహ మంత్రి, విశ్వహిందూ పరిషద్), శ్రీ అశోక్ గుప్తా గారు (సహ మంత్రి, విశ్వహిందూ పరిషద్), శ్రీ వేణుగోపాల్ గారు (ప్రాంత కార్యవర్గ సభ్యులు), శ్రీ విపిన్ గారు (ప్రాంత కన్వీనర్, ధర్మ జాగరణ్) తదితర ప్రముఖ సామాజిక నాయకులు మరియు శ్రేయోభిలాషులు జయప్రదం చేసారు.
కార్యక్రమం ముగింపులో ఆర్ష విద్య సమాజం పూర్తి కాల సేవకులు ప్రదర్శించిన అద్భుతమైన డాక్యుమెంటరీ నృత్యనాటిక ‘భారతం’ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సమాజంలోని సమస్యల్ని మరియు ధార్మిక పరిష్కారాలను సుందరంగా చిత్రీకరించడం ద్వారా ఈ నాటిక అందరినీ ఆకట్టుకుంది.
ప్రదర్శనలో నేటి సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఆరు రకాల మెదడు నియంత్రణ (బ్రెయిన్ వాషింగ్) శక్తులు స్పష్టంగా చిత్రీకరించబడటమే కాక, ధార్మిక అధ్యయనం, అవగాహన, సమాజ సేవ — ఇవన్నీ కలిసి ఎలా సార్థకమైన పరిష్కారాలు అందిస్తాయో చక్కగా వర్ణించబడింది.